నేడు మేడ్చల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌

cm-kcr-inaugurates-medchal-district-collectorate

హైదరాబాద్ః సిఎం కెసిఆర్‌ ఈరోజు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. శామీర్‌పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రగతిభవన్ నుంచి సిఎం కెసిఆర్ బయల్దేరి 2.55 గంటలకు మేడ్చల్ జిల్లా అంతాయిపల్లికి చేరుకోనున్నారు. 3 గంటలకు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రజలకు అంకితం చేస్తారు.

అనంతరం అంతాయిపల్లిలో బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ప్ర‌సంగించ‌నున్నారు. సిఎం టూర్ సందర్భంగా మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు అల్వాల్ ముత్యాలమ్మ ఆలయం నుంచి అంతాయిపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ సీపీ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/