మహేంద్ర సింగ్ ధోనికి మరో నిక్‌ నేమ్‌

‘తాలా’ నాకు చాలా ప్రత్యేకమైన నిక్‌ నేమ్‌: ధోని

MS Dhoni
MS Dhoni

ముంబయి: భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. భద్రతా కంచెలు దూకి దాటుకొని వచ్చి కెప్టెన్ కూల్ కాళ్లకు నమస్కరించి.. మా జీవితాల్లో ఇదో అత్యద్భుత ఘట్టం అని ఫీలైపోయే వారెందరో. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ప్రతీ ఒక్కరితో కచ్చితంగా కరచాలనం చేస్తాడు. అంతేనా.. గ్రౌండ్‌లో వారికి దొరక్కుండా పరుగెడుతూ ఆటపట్టిస్తాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి అండగా ఉంటూ, బౌలర్లకు సలహాలు ఇస్తూ, వికెట్ల వెనుక ప్రత్యర్థిని కట్టడి చేస్తూ.. గొప్ప మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న ధోనికి ఎన్నో నిక్ నేమ్‌లు ఉన్నాయి. మహి, ఎమ్ఎస్‌డీ, ధోని, ఎంఎస్.. ఇలా చాలా పేర్లే ఉన్నాయి.

ఇప్పుడు ఆ పేర్ల జాబితాలో మరో పేరు వచ్చి చేరింది. అదే.. ‘తాలా’. ధోనిని సీఎస్‌కే అభిమానులు ‘తాలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవంతో పిలుస్తున్నందున ఆ పేరు అంటే ఎప్పటికీ తనకు ప్రత్యేకమేనని అంటున్నాడు ధోని. ‘తాలా’ నాకు చాలా ప్రత్యేకమైన నిక్‌ నేమ్‌. తమిళనాడులో ఎక్కడికి వెళ్లినా నన్ను ధోని అని కాకుండా ‘తాలా’ అని పిలుస్తారు. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నన్ను ఆ పేరుతో పిలవడం నా అదృష్టం. నా ముద్దుపేర్లలో ‘తాలా’ వెరీ స్పెషల్‌. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నాకు, మా టీమ్‌కు ఎప్పుడూ మద్దతిచ్చారు. వారిని మరిచిపోను’ అని ధోని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/