బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానం
ధన్‌తేరస్‌కు బంగారం కొనుగోలుకు ఆసక్తి-అందుబాటులో గోల్డ్ సేవింగ్ స్కీమ్,సావరిన్ గోల్డ్ బాండ్

ముంబై : బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ధన్‌తేరస్, దీపావళి వచ్చిందంటే బంగారం షాపులకు పండుగే పండుగ.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారతదేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24 వేల టన్నులు. దీని విలువ 58లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ.
భారత్‌లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28శాతం ఉంది. అంటేప్రపంచంలో ఉన్న బంగారంలో 28 శాతం భారత్‌లోనే ఉంది.
తర్వాతి స్థానం చైనాది. భారత్‌లో బంగారానికి గిరాకీ ఉండడం వల్ల చాలా వరకు ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
ప్రపంచంలో బంగారం ఉత్పత్తి చేసే 5 అతిపెద్ద దేశాలు-చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, రష్యా కాగా వాటి నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.
2018 నాటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంకు, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వ. ఆ బ్యాంకులో 8వేల టన్నులకుపైగా బంగారం నిల్వ ఉంది. నిల్వల జాబితాలో పదో స్థానంలో ఉన్న భారత రిజర్వ్ బ్యాంకులో 560 టన్నులకుపైగా బంగారం ఉంది. బంగారం వర్తకుల నుంచి బంగారం కొనుగోలు చేయడమే మనకున్న ఏకైక లాభదాయకమైన మార్గమా? అంటే కాదనే చెప్పాలి.

దీనికి పలు మార్గాలున్నాయి. భౌతికంగా అంటే, ఆభరణాలు, బంగారం బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కొనడం. ఇవి ఆభరణాల దుకాణాల్లో లభిస్తామనేది తెలిసిందే. ఇక రెండవది డిజిటల్ గోల్డ్.
అంటే గోల్డ్ ఎక్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్, మరొకటి సావరిన్ గోల్డ్ బాండ్లు. భారత్‌లో డైమండ్స్, ప్లాటినం ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
అయితే నమ్మకం విషయానికొస్తే మాత్రం బంగారానికే గోల్డ్ మెడల్ దక్కుతుంది. వెండి, బంగారాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రజలు వీటిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు ..

గోల్డ్ సేవింగ్ స్కీమ్:
ఇందులో ఒక నిర్ణీత కాలం పాటు నెలకు కొంత చొప్పున నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
నిర్ణీత కాలం పూర్తయ్యాక డిపాజిట్ చేసిన విలువకు సమానమైన బంగారం కొనుక్కోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్:
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ బాండ్లను విడుదల చేస్తుంటుంది. 2-3నెలలకోసారి వీటిని విడుదల చేస్తూ విండో ఓపెన్ చేస్తుంది. ఈ విండో వారం రోజుల పాటు తెరిచి ఉంటుంది.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/