రూపాయి పతనం!

మార్చికల్లా జోరందుకోగలదని అంచనా

Rupee Falls
Rupee Falls

ముంబై,: ఆర్థిక రికవరీ సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దేశీయ కరెన్సీ మార్చికల్లా జోరందుకోగలదని రీసెర్చ్‌ సంస్థ నోమురా హోల్డింగ్స్‌ అంచనా వేసింది.

వెరసి డాలరుతో మారకంలో రూపాయి తిరిగి కొవిడ్‌-19కు ముందుస్థాయికి చేరుకోగలదని అభిప్రాయపడింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి 72స్థాయిలో ట్రేడయ్యింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహాయ ప్యాకేజీ ప్రకటన, పసిడి, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజాగా దేశీయ కరెన్సీ వెనకడుగు వేస్తోంది.

ప్రస్తుతం ఇంటర్‌ బ్యాంకు ఫోరెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో 33పైసలు తగ్గి రూ.74.70కి చేరింది.

ఇది రెండు నెలల కనిష్టం కాగా, మొదట 7పైసలు తగ్గి 74.44వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి మరింత పడిపోయింది.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/