మునుగోడు లో ఓటర్లకు మందు, చికెన్ , డబ్బు పంపిణి

మునుగోడు లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతుంది..ఈ క్రమంలో ఓటర్లకు మందు , చికెన్ , డబ్బు పంపిణి చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఓటుకు మూడు వేల నుండి ఐదు వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే డబ్బుతో పాటు కేజీ చికెన్ , ఫుల్ బాటిల్ మందు ఇస్తున్నారట. అవతలి పార్టీ ఏమి ఇస్తే అలాగే మరో పార్టీ ఇస్తున్నట్లు సమాచారం. ఓటర్లు మాత్రం ఎవర్ని కాదనకుండా అన్ని పార్టీల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడే కదా మన మొహాలు చూసేది..తర్వాత చూస్తారా అంటూ ఎవరు ఇచ్చిన కాదనా కుండా తీసుకుంటున్నారు.

మరోపక్క పోలీసులు కూడా తనికీలు గట్టిగానే చేస్తున్నారు. నాంపల్లి మండలంలో పస్నూర్​ లో టీఆర్​ఎస్ పార్టీ మాజీ సర్పంచ్​ పోగుల వెంకటరెడ్డి ఇంట్లో రూ.92వేల నగదు, లక్షా 25 వేల విలువగల మద్యం పట్టుబడినట్లు సీఆర్​ఎఫ్​ డీఎస్పీ సోఫ్నిల్​ తెలిపారు. వెంకటరెడ్డి ఇంట్లో గంట పాటు సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో కూల్​ డ్రింక్స్​, వాటర్​ బాటిల్స్​ స్వాధీనం చేసుకుని సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. గోడగడియారాలు, గొడుగులు కూడా దొరికినట్టు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని స్థితియతండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు 80 కిలోల చికెన్ తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్​ మండల తుప్రాన్​పేటలో వెహికల్​ స్టెఫ్నీ టైర్​లో తరలిస్తున్న రూ.93.49 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.