భారత్‌లో 1071 కరోనా కేసులు, 29 మరణాలు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి.

corona virus
corona virus

దిల్లీ: భారత్‌ లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. నేటి ఉదయానికి దేశంలో కరోనా భాధితుల సంఖ్య 1071 కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 29 మరణించగా.. 100 మంది కోలుకున్నారని తెలిపింది. ఇంకా 942 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. కాగా మహరాష్ట్రలో దీని తీవ్రత అధికంగా ఉంది, ఇప్పటికే 218 కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు. దీని బారి నుండి 25 మంది కోలుకున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/