కరోనాపై పోరుకు రహనే విరాళం

10 లక్షలు, మహరాష్ట్ర సిఎం సహయనిధికి ఇచ్చినట్టు వెల్లడి

ajikya rahane
ajinkya rahane

ముంబయి: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుండడంతో..దీని నివారణకై దేశంలోని క్రీడాకారులంతా తమవంతుగా సహాయం చేస్తున్నారు. తాజాగా భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహనే కూడా తన వంతుగా విరాళంను ప్రకటించాడు. మహరాష్ట్ర ప్రభుత్వ సిఎం సహయనిధికి రూ.10లక్షలు విరాళం ఇచ్చినట్టు వెల్లడించాడు. కరోనా పై చేస్తున్న పోరులో తాను ఓ చిన్న సాయం చేస్తున్నానని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని సూచించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/