టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

india vs new zealand
india vs new zealand

ఆక్లాండ్‌: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉందన్న ఉద్దేశంతోనే టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిసింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని టీమిండియా జట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ధవన్‌, పాండ్యా, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ గాయాలతో దూరం కావడం టీమిండియా జట్టును కలవరపెడుతోంది. సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో సిరీస్‌లను ఆడేందుకు మరోసారి ఇక్కడ అడుగుపెట్టింది. బ్యాట్స్‌మెన్‌ నైపుణ్యానికి పరీక్షగా నిలిచే ఈడెన్ పార్క్ పిచ్‌, వాతావరణాన్ని ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. అందుకే గట్టి పోటీ ఎదురయ్యే ఈ సిరీస్‌‌లో సత్తా చూపడంతో పాటు గతేడాది ఇక్కడ సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/