బీఎస్‌ఎన్‌ఎల్‌తో జత కట్టిన యప్‌ టీవీ

గ్రామీణ ప్రజలకు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందించేందుకే

yupptv-join-forces-with-bsnl
yupptv-join-forces-with-bsnl

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రజలకు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌ యప్‌టీవీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ ఏడాదిలో తెలంగాణ సర్కిల్‌తో పాటు సౌత్‌ జోన్‌లో సేవలు మొదలుకానున్నాయి. ఈ నెల 22న ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో టెమా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వీణవంక గ్రామంలో భారత్‌ ఎయిర్‌ఫైబర్‌ సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించింది. భారత్‌ ఎయిర్‌ఫైబర్‌ బిజెనెస్‌ మోడ్‌ గురించి బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (సీఎఫ్‌ఏ) వివేక్‌ బంజల్‌ వివరిస్తూ గ్రామీణ ప్రాంత గృహాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే క్రమంలో ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని చెప్పారు. గ్రామీణ గృహాలకు రేడియో ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు గ్రామస్థాయి బీఎస్‌ఎన్‌ఎల్‌తో చేతులు కలిపే విధానాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. యప్‌ టీవీ వ్యవస్థాపక సీఈవో ఉదయ్‌ రెడ్డి  మాట్లాడుతూ..దేశంలో తదుపరి డిజిటలీకరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి తాము చేపట్టడం సంతోషకరమని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/