మొబైల్‌ నెట్‌వర్క్‌ విపరీతంగా పెరిగింది

మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒకటిగా అవతరిస్తుంది

mukesh ambani
mukesh ambani

ముంబయి: ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత్‌ అవతరిస్తుందని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ అన్నారు. భారతదేశం ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా అవతరించే దశలో ఉందని అన్నారు. ముంబయిలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదేళ్లతో నిర్వహించిన ప్యూచర్‌ డీకోడ్‌ సీఈవో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభావం మొబైల్‌ నెట్‌వర్క్‌ విపరీతంగా పెరగడంతో పాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరించడం వల్లేనన్నారు. ఇదంతా 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా వల్లేనని చెప్పారు. 380 మిలియన్ల మంది ప్రజలు జియో 4జీ టెక్నాలజీ వైపు మళ్లారన్నారు. ప్రీ జియో డేటా స్పీడ్‌ 256 కేబీపీఎస్‌ కాగా పోస్ట్‌ జియో వేగం 21 ఎంబీపీఎస్‌తో ఉందని వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/