కరోనా పై ఆందోళన..ప్లాంట్ మూసేస్తాం!

మున్ముందు కరోనా తీవ్రత పెరిగితే మహారాష్ట్రలోని ప్లాంట్ నుమూసేస్తాం: టాటా మోటార్స్ ఎండీ

TATA MOTORS
TATA MOTORS

ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకోనుంది. మున్ముందు కరోనా తీవ్రత పెరిగితే మహారాష్ట్రలోని ప్లాంట్ ను మూసివేస్తామని టాటా మోటార్స్ ఎండీ గ్వెంటర్ బషెక్ వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితులను పరిశీలిస్తున్నామని, పరిస్థితి తీవ్రతను అనుసరించి మంగళవారం నుంచి ప్లాంట్ కార్యకలాపాలు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే ప్లాంట్ లో టాటా మోటార్స్ ఇప్పటికే వాహనాల తయారీని తగ్గించింది. ఒకవేళ ప్లాంట్ మూసివేసినా ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు చెల్లిస్తామని టాటా వర్గాలు ప్రకటించాయి. అటు టాటా అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ కూడా బ్రిటన్ లో ఏప్రిల్ 20 వరకు కార్యకలాపాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/