మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్‌ సర్వం సిద్ధం

munugode-bypoll-all-set-for-munugode-by-election

చండూరుః మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రమైన చండూరులోని డాన్‌బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు. గ్రామాల వారీగా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అధికారులు పంపిణీ చేస్తున్నారు. సామాగ్రి తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి బరిలో నిలిచారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/