పరిశ్రమలు పెడితే ప్రోత్సాహకాలు
బీహార్ సీఎం నితీశ్ కుమార్ వెల్లడి

Patna: బీహార్ లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కోరారు.
అందుకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. బిహార్‌కు లక్షలాది వలస కూలీలు తిరిగి రావడంపై నితీశ్ స్పందించారు.
‘మాది వినియోగిత రాష్ట్రం. మాకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఈ రాష్టానికి చెందిన బిజినెస్ మెన్ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
వాళ్లు బిహార్ లో కొత్త ఇండస్టీలు ఏర్పాటు చేయాలి. వారికి కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎవరైతే రాష్ట్రంలోనే వాణిజ్యం చేయాలనుకుంటున్నారో వారికీ సర్కార్ తోడుగా ఉంటుందన్నారు.
ఇక్కడి ప్రజలకు ఇక్కడే ఉపాధి, ఉద్యోగలు కల్పించాలనేది మా లక్ష్యమని నితీష్ అన్నారు.
ఇందు వల్ల పనుల కోసం ఇతర రాష్టాలకు వలస వెళ్లే అవసరం రాష్ట్రవాసులకు ఉండదన్నారు.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/