సామాజిక శాస్త్రానికి ప్రాధాన్యత కల్పించాలి

ప్రోత్స హం ఇవ్వకపోవడం వల్ల అనేక అనర్ధాలు

Social Science
Social Science

సమాజంలో మానవ మనుగడ గూర్చి క్లుప్తంగా వివరించేది సామాజికశాస్త్రం.

మానవుల మధ్యగల సంబంధాలు, ఆచారసాంప్రదాయాలు, సంస్కృతీ, కట్టుబాట్లను తెలుపుతూ పరిణామ క్రమంలో భాగంగా సామాజిక పరిణితి ఎలా చెందుతుంది?

ఎన్ని కొత్త విషయాలు పుట్టుకొచ్చి సమస్యలను తల పడుతున్నాయి? వాటినెలా పరిష్కరించుకోవాలి?

బంధాలు, అనుబం ధాలు వల్ల కలిగే లాభాలేటి? పరిస్థితులను బట్టి మనిషియొక్క ఆలోచనారీతిలో మార్పులెలా వస్తాయి?

వాటి నెలా నియంత్రిం చుకోవాలి? అసలు మనిషి మనిషిలా జీవించ డానికి ఏం చేయా లి? ఎలా చేయాలి? అని తెలియజేసేదే సామాజిక శాస్త్రం.

ఈ శాస్త్రం యొక్క అవసరం సమాజంలో ప్రతిఒక్కరికి ఎంతైనా ఉంటుంది.

అందుకే సమాజంలో అత్యు న్నత కొలువైన సివిల్స్‌ పొందాలంటే సామాజిక శాస్త్రానికి అంశంగా ఎందుకోవడానికి అవకాశం కల్పించాలి

కానీ దానిని గ్రహించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అకాడమిక్‌ విద్యలో దానికి తగినంత ప్రోత్స హం ఇవ్వకపోవడం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయని చెప్ప డంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.

ప్రపంచీకరణ నేప త్యంలో ప్రపంచం ఒక కుగ్రా మంగా తయారయ్యింది. పరిణామ క్రమంలో భాగంగా క్రమంగా ఒకప్పటి పల్లె వాతావారణం కనుమరగవుతున్నది.

పసిపాపలను వివిద కేర్‌ సెంటర్లలో ఉంచి భార్యా భర్తలిద్దరూ పొద్దునపోయి రాత్రికొచ్చే ఉద్యోగాలు చేస్తేగాని నాలుగు డబ్బులు వెనుకేసుకోలేని పరిస్థితులు దాపురిస్తున్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కరలేదు.

పోటీ ప్రపంచంలో పిల్లలను పుస్తకాలను బట్టీపట్టే మిషల్‌లా తయారుచేస్తూ ర్యాంకులు, మార్కులంటూ వారిపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రు లెందరో ఉన్నారు.

పోటీ పరీక్షలలో సరైన ర్యాంక్‌ రాకపోయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసు కోవడానికి వెనుకా డటం లేదు.

ఉద్యోగరీత్యా ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో వారిచ్చిన టార్గెట్స్‌ సకాలంలో పూర్తిచేయలేక ఒత్తిడికి లోనవ్ఞతూ వ్యసనాల బారినపడుతున్నారు.

సంఘ వ్యతిరేక పనులకు పూను కోని అసాంఘీక చర్యలకు పాల్పడుతూ సమస్యతో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు.

అన్ని రకాల కోర్సులు, గ్రూపులలో అంటే ఇంజిరింగ్‌, మెడిసిన్‌, న్యాయ సంబంధిత కోర్సులలో సైతం సకారాత్మ కమైన మార్పు లను తీసుకరవ డానికి దోహదబడుతుందనడంలో నిజం లేకపోలేదు.

భారత దేశానికి ఒక విశిష్ఠ స్థానం నెలకొని ఉన్నదంటే కారణాలు ఏంటో అందరికి తెలిసినవే. కానీ వాటిని వాస్తవంగా ప్రస్తుతం కొనసా గిస్తున్నామా అంటే తడబడక తప్పని పరిస్థితి.

అక్కడక్కడా కొన్నిచోట్ల ఆచరిస్తున్న, ఈ పోటీ ప్రపంచంలో క్రమంగా కనుమరగవుతుందనడంలో ఎలాంటి అబద్దం లేదు.

మనదేశ గొప్పతనాన్ని శాశ్వితంగా కాపాడుకోవాలంటే తప్పని సరిగా సమాజశాస్త్రాన్ని బోధించకతప్పని పరిస్థితి ఉన్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.

ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాధ్యాతనిస్తున్నా కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పట్టించుకోవడం లేదన్నది వాస్తవం.

అందుకే ఇప్పటికైనా దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించదానికి తగిన ప్రాధాన్యతను కల్పించడంలో భాగంగా ప్రతి విద్యార్థి చదివే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

రెండు సంవత్సరాల క్రితమే యుజిసి ఈ సబ్జెక్ట్‌కు ప్రాధాన్యత కల్పించాలని మార్గదర్శకాలు జారీచేసిన, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ విషయం లో పలు సమా వేశాలు నిర్వహించాలి,

రేపుమాపు అంటూ పేపర్లో ప్రకటనలకే పరిమిత మవుతున్నాయి.

భావితరాలకు మార్గనిర్దేశకాలు చేసే కోర్సులను గుర్తించడానికి ఒక కమిటీని వేసి, నివేదిక తెప్పించుకోని ఉపయోగపడే సాంప్ర దాయ కోర్సులకు జీవం పోయాలి .

భవిష్యత్‌ తరాలకు అండగా నిలవాలని, దీనికై సావజిక వేత్తలు, విద్యా వంతుల సహకారాలు కూడా అందాలని ఆశిద్దాం.

  • డాక్టర్‌ పోలం సైదులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/