కర్ణాటకలో ముగ్గురు పోలీసులకు కరో్నా
ఉడిపి జిల్లాలో 3 పోలీస్ స్టేషన్ల మూసివేత

Bangalore: ముగ్గురు పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలడంతో కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లను మూసివేశారు.
అజెకర్, కర్కల, బ్రహ్మవర్ స్టేషన్లలో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్కి కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో మూడు స్టేషన్లతో పాటు ఒకే భవనంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు జిల్లా అధికారులు సోమవారం మీడియాకు తెలిపారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/