మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించిన ప్రియాంక గాంధీ

యూపీలోని లలిత్ పూర్ లో నలుగురు రైతుల మృతి


ఉత్తరప్రదేశ్: ఎరువుల కోసం క్యూలో గంటల సేపు నిలబడి, అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఈరోజు పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ కు వెళ్లిన ఆమె రైతు కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఎరువుల కొరతతో బాధపడుతోందని విమర్శించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రియాంకాగాంధీ చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/