పౌర‌విమాన‌యాన శాఖ సెక్రెట‌రీగా రాజీవ్ బ‌న్స‌ల్‌ నియామకం

న్యూఢిల్లీ : రాజీవ్ బ‌న్స‌ల్ పౌర‌విమానయాన శాఖ సెక్రెట‌రీగా నియమితుల‌య్యారు. ప్ర‌స్తుతం పౌర‌విమానయాన శాఖ సెక్రెట‌రీగా పనిచేస్తున్న ప్ర‌దీప్‌సింగ్‌ ఖ‌రోలా సెప్టెంబ‌ర్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌టంతో.. ఆయ‌న స్థానంలో రాజీవ్ బ‌న్స‌ల్‌ను నియ‌మించారు. బ‌న్స‌ల్ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎయిరిండియా సీఎండీగా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్ర‌యించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొన్నిరోజుల‌కే ఆయ‌నను రెండోసారి ఎయిరిండియా సీఎండీగా నియ‌మించారు.

ఎయిరిండియా సీఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందు రాజీవ్ బ‌న్స‌ల్.. భార‌త పెట్రోలియం, స‌హ‌జ‌వాయు శాఖ‌ల మంత్రిగా ప‌నిచేశారు. బ‌న్స‌ల్ 1988 బ్యాచ్‌కు చెందిన నాగాలాండ్ క్యాడ‌ర్‌ ఐఏఎస్ అధికారి. హ‌ర్యానాకు చెందిన రాజీవ్ బ‌న్స‌ల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాలజీ శాఖ‌లో కూడా త‌న సేవ‌లు అందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/