గుజరాత్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో..నరేంద్ర మోడీ స్టేడియం పేరు మారుస్తాం

In Gujarat Manifesto, Congress Promises To Rename Narendra Modi Stadium

అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వ‌స్తే అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును మార్చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ త‌న మ్యానిఫెస్టోలో పేర్కొన్న‌ది. ఆ స్టేడియంకు స‌ర్దాల్ పటేల్ పేరును పెట్ట‌నున్న‌ట్లు ఆ పార్టీ పేర్కొన్న‌ది. 10 ల‌క్ష‌ల మంది గుజ‌రాతీల‌కు ఉద్యోగులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌భుత్వం ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్నారు. ఒంట‌రి మ‌హిళ‌కు నెల‌కు రూ.2వేలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మూడువేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌ను రీఓపెన్ చేస్తామ‌న్నారు. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య‌ను అందించ‌నున్న‌ట్లు మ్యానిఫెస్టోలో వెల్ల‌డించారు. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు రైతు రుణాల‌ను ఎత్తివేయ‌నున్నారు. 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. నిరుద్యోగ యువ‌త‌కు నెలా రూ.3వేలు ఇవ్వ‌నున్న‌ట్లు మ్యానిఫెస్టోలో చెప్పారు.

తాజా అంతర్జాతీ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/