పుంగనూరు, గుంతకల్లుల ఘటనలపై స్పందించిన చంద్రబాబు

తీవ్రస్థాయిలో స్పందించిన చంద్రబాబు

Chandrababu Tour Program in Kuppam
tdp-chief-chandrababu

అమరావతిః చిత్తూరు జిల్లా పుంగనూరులో టిడిపి కార్యాలయానికి అద్దెకు ఇచ్చిన ఓ భవనం అక్రమ నిర్మాణం అంటూ అధికారులు కూల్చివేతకు సిద్ధమవడం, అనంతపురం జిల్లా గుంతకల్లులో మహిళల కుట్టుశిక్షణ కేంద్రానికి నిప్పు పెట్టడం వంటి ఘటనలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.

పుంగనూరు, గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి రాక్షస రాజకీయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. పుంగనూరులో టిడిపి కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయించడానికి స్వయంగా ఎస్పీ బలగాలతో వెళతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఐపీఎస్ కు అర్హులేనా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

అటు, గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా? ఇదేనా మీ రాజకీయం అంటూ మండిపడ్డారు. తగలబెట్టడం, కూలగొట్టడం వంటి తమ సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైఎస్‌ఆర్‌సిపి ఇంకా బయటికి రాలేదా? అని చంద్రబాబు విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/