గాడిద ఎక్కడున్నా గాడిదే: ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూకేను తాను ఎప్పుడూ తన సొంత దేశం అని అనుకోలేదని వ్యాఖ్య

ఇస్లామాబాద్: గత నెల 10వ తేదీన పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతంలో యూకే పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం చేసిన ఆసక్తికర వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. కంటెంట్ క్రియేటర్ జునైద్ అక్రమ్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… తాను యూకేకి వెళ్లినప్పుడు సాదర ఆహ్వానమే దక్కిందని, అయితే, యూకేను తాను ఎప్పుడూ తన సొంత దేశం అని అనుకోలేదని అన్నారు.
ఎందుకంటే తాను పక్కా పాకిస్థానీనని చెప్పారు. ఒక గాడిదకు చారలు పెట్టినంత మాత్రాన అది కంచర గాడిద అయిపోదని, గాడిద ఎక్కడున్నా గాడిదేనని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. కాగా, పదవిని కోల్పోయినప్పటి నుంచి పాకిస్థాన్ నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/