టెర్రెస్‌పై గార్డెన్
ఇంట్లో మొక్కల పెంపకం

పంటలు పండించే తీరు ఆసాంతమూ రసాయనాల మయం అయిపోయిన తర్వాత ఆహారం రసాయనాల అవశేషాలతో అనారోగ్యకరంగా మారిపోయింది.
ఈ ముప్పు నుంచి మానవాళి తప్పించుకోవాలంటే .. పంటల ఉత్పత్తిదారులైన రైతుల అలవాటు మారాలి. వారితోపాటు సహ ఉత్పత్తిదారులైన వినియోగదారులూ మారాలి.
రసానాల మకిలి లేని మంచి ఆహారాన్ని ఇష్టపడే ప్రజలు ఎవరైనా ముందు చేయాల్సింది వారి ఇంటిపైన, ముందు, వెనుక ఉన్న కొది పాటి స్థలంలోనైని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి తక్షణం శ్రీకారం చుట్టటమే.
ఈ చైతన్యానిన్న అందిపుచ్చుకోవటంలో, జనబహుళ్యంలో ప్రచారంలోకి తేవటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ బాధ్యతను గురైరిక ఏడాది కాలంలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయవచ్చు.
ఎర్రమట్టి, నల్లమట్టి, బాగా చివికిన పశువుల ఎరువు, ఇసుక, కొబ్బరి పీచు తగు పాళ్లలో కలిపిన మిశ్రమం ప్లాస్టిక్ డబ్బాలు, బక్కెట్లతో ధర్మోకోల్ బాక్సుల్లో వేసి మొక్కలు నాటారు.
డబ్బాలు, బక్కెట్ల కింద ఇనుప స్టాండ్లను అమర్చి శ్లాబు సంరక్షణకు చర్యలు చేపట్టవచ్చు.
వంగ, టమోట, బెండ, తీగ బచ్చలి, తోటకూర, పాలకూర, గోంగూర, చిక్కుడు, బీర, కాకర, దోస, పొట్ల మొక్కలను పెంచుతున్నారు.
మామిడి, తీపి నారింజ, గులాబి, జామ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, ప్యాషన్ ఫ్రూట్, బ్లూ బెర్రీ, అంజూర, స్ట్రాబెర్రీ, జామ, యాపిల్ బెర్, స్టార్‌ఫ్రూట్, నిమ్మ, ఆల్ సస్పైసిస్, మెక్సికన్ అకాడో వంటి అరుదైన మొక్కలను సేకరించి పెంచవచ్చు.
ఎంతో ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/