ఢిల్లీలో అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Disqualified As MP, Rahul Gandhi To Vacate Official Bungalow In Delhi – odishabytes

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో త‌న అధికార నివాసాన్ని ఈరోజు ఖాళీ చేశారు. ప‌రువున‌ష్టం కేసులో రెండేళ్ల శిక్ష వ‌ల్ల రాహుల్ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. ఢిల్లీ ప్ర‌భుత్వ బంగ్లాలో 2005 నుంచి రాహుల్ ఉంటున్నారు. అన‌ర్హ‌త వేటు ప‌డిన ఎంపీ.. ప్ర‌భుత్వ భ‌వ‌నంలో ఉండ‌డానికి అన‌ర్హులు. శిక్ష ప‌డిన త‌ర్వాత నెల రోజులు నోటీస్ పీరియ‌డ్ ఇచ్చారు. అయితే నేడు రాహుల్ అనివార్య ప‌రిస్థితుల్లో బంగ్లా ఖాళీ చేయాల్సి వ‌స్తోంది.

కాగా, జేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌స‌భ హౌజింగ్ క‌మిటీ .. బిల్డింగ్ ఖాళీ చేయాల‌ని రాహుల్‌కు లేఖ పంపింది. దీంతో 12 తుగ్ల‌క్ లేన్ బంగ్లాను రాహుల్ వెకేట్ చేశారు. ప్రోటోకాల్ ప్ర‌కారం రాహుల్ త‌న నివాసాన్ని ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. అయితే కేంద్ర స‌ర్కార్ రాజ‌కీయ క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిజానికి ప‌రువున‌ష్టం కేసులో గుజ‌రాత్ కోర్టు తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల గ‌డువు ఇచ్చింది. అయితే శుక్ర‌వారం ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించినా.. అక్క‌డ ఊర‌ట ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న త‌న ఎంపీ అభ్య‌ర్ధిత్వాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. సూర‌త్ సెష‌న్స్ కోర్టు తీర్పు గాంధీ ఫ్యామిలీకి చెంప‌పెట్టు అని బిజెపి ఆరోపించింది. అయితే సూర‌త్ కోర్టు తీర్పును వ్య‌తిరేకిస్తూ.. ఇప్పుడు రాహుల్ గాంధీ గుజ‌రాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.