షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం..గోవా సీఎం

ప‌నాజీ : నేడు గోవా రెవ‌ల్యూష‌న్ డే. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర సీఎం ప్ర‌మోద్ సావంత్, గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారి, మార్గోవాలో ఉన్న అమ‌ర‌వీరుల స్మార‌కం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ త‌ర్వాత సీఎం ప్ర‌మోద్.. మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎన్నిక‌ల సంఘ‌మే తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. కానీ షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సీఎం ప్రమోద్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గోవా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇటీవ‌ల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ వివ‌ర‌ణ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/