సెప్టెంబర్ 16 న ఏపీ కేబినేట్ సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా శాసనసభ వర్షాకాల సమావేశాల పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కరోనా పరిస్థితి, సిఎం జగన్ ఢిల్లీ పర్యటన, జలవనరుల అంశాల గురించి చర్చించనున్నారు.

అదే విధంగా ఫీజు రియంబర్స్ మెంట్ పై హైకోర్ట్ తీర్పు నేపధ్యంలో దాని గురించి కూడా సమావేశంలో చర్చ జరగనుంది. సింహాచలం భూముల విషయంలో సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి మంత్రి వర్గంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత సమావేశంలో నవరత్నాల పథకాల అమ‌లు, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించారు.