ఆ మ్యాచ్ లో లక్ష్మణ్ పై అరిచాను

గత అనుభవాలను గుర్తుకు చేసుకున్న సచిన్

sachin tendulkar
sachin tendulkar

ముంబయి ; కరోనా కారణంగా యావత్ క్రీడాలోకం స్తంభించి పోయింది. దీనితో ఆటగాళ్లు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన గత అనుభవాలను ఓ టీవీ ఛానల్ ద్వారా పంచుకున్నాడు. 1998 లో షార్జా లో కోకాకోలా కప్ సందర్బంగా తాను తన సహచర ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ పై కోప్పడినట్లు గుర్తుచేసుకున్నాడు. ఆ టోర్నీ అనంతరం తన సోదరుడు ఆ విషయం పై తనను మందలించాడని తెలిపాడు. టోర్నీ లో ఓ మ్యాచ్ లో లక్ష్మణ్ వేగంగా పరుగెత్తలేకపోతున్నట్టు అనిపించింది. దీనితో ఆ మ్యాచ్ లో రెండు పరుగులు తీయాలని చెబుతున్న.. అంటూ తనపై కోపడ్డాను. ఆలా ఆ మ్యాచ్ లో రెండు మూడు సార్లు అతనిపై అరిచాను. టోర్నీ అనంతరం ముంబయి వచ్చిన నాకు మా అన్నయ్య క్లాస్ తీసుకున్నాడు. లక్ష్మణ్ కూడా నీలాగే టీం కోసం ఆడుతున్నాడు. ఎంతైనా అతడు ని టీం మేట్, అయిన అది ని ఒక్కడి మ్యాచ్ కాదు, మరోసారి ఆటలో ఆలా ప్రవర్తించవద్దు. అంటూ నాపై అరిచాడు. అంటూ తన అనుభవాలను సచిన్ చెప్పుకొచ్చాడు .

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/telangana/