వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

talasani srinivasa yadav
talasani srinivas yadav

హైదరాబాద్; తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్ర హొమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి ఫోన్ చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ విషయాల గురించి మంత్రి మీడియాకు వివరిస్తూ.. తెలంగాణ లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించడానికి రైలు సదుపాయాలను ఏర్పాటు చేయాలనీ కోరగా.. అందుకు నేటి నుంచి వలస కార్మికుల తరలింపుకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపినట్లు మంత్రి అన్నారు. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించి చేతులు దులుపుకుంటే సరిపోదని వలస కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలలి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించడం తో నేడు ఉదయం తెలంగాణ నుండి జార్ఖండ్ కు చెందిన సుమారు 1200 వలస కార్మికులతో ఒక రైలు బయలుదేరింది .

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/national/