ప్రస్తుతం బుల్డోజర్లకూ విశ్రాంతినిచ్చాం : సీఎం యోగి

మార్చి 10 తర్వాత బుల్డోజర్లు మళ్లీ పని మొదలుపెడతాయి: యూపీ సీఎం యోగి హెచ్చరిక

లక్నో : రాష్ట్రంలోని బుల్డోజర్లు అన్నీ ప్రస్తుతం మరమ్మతులో ఉన్నాయని, ఎన్నికల ఫలితాలు వెల్లడైన మార్చి 10వ తేదీ తర్వాతి నుంచి అవన్నీ తిరిగి రంగంలోకి దిగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్లను హెచ్చరించారు. ఆదివారం మూడో విడత ఎన్నికలు జరగనున్న మెయిన్‌పురి, కర్హాల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, ర్యాలీల్లో ప్రసంగించిన యోగి.. ‘‘ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లు పనిచేస్తాయా?’’ అన్న సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశ్నకు బదులిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.

ఆ ప్రశ్న అడిగిన నేతకు ఆందోళన వద్దని చెప్పానని యోగి వ్యంగ్యంగా అన్నారు. బుల్డోజర్లకూ విశ్రాంతి కావాలని, ప్రస్తుతం అవన్నీ మరమ్మతుకు వెళ్లాయని అన్నారు. కలుగుల్లో దాక్కున్న నేరగాళ్లు ఎన్నికల వేళ బయటకు వస్తున్నారని, ఫలితాల అనంతరం వారి కథ కంచికి చేరుతుందని యోగి హెచ్చరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/