తెలంగాణ బడ్జెట్ : ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే ..

అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు.. అలాగే మండ‌లిలో మంత్రి ప్ర‌శాంత‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రూ. 2,90,396 కోట్లతో బ‌డ్జెట్ ను ప్ర‌తిపాదించారు. మరి ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారనేది చూస్తే..

  • 2023-24 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు
  • రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 37,525 కోట్లు.
  • వ్యవసాయ శాఖకు బడ్జెట్ లో రూ. 26,831 కోట్లు

*ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు

*నీటిపారుదల రంగానికి బడ్జెట్ లో రూ. 26,885 కోట్లు

*విద్యుత్ రంగానికి బడ్జెట్ లో రూ. 12,727 కోట్లు

*ప్రజా పంపిణీ వ్యవస్థకు బడ్జెట్ లో రూ. 3,117 కోట్లు

*ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్ లో రూ. 12,000 కోట్లు

  • ఇరిగేషన్​ కు రూ. 26వేల 885 కోట్లు కేటాయింపు
  • దళితబంధు పథకానికి రూ. 17వేల 700 కోట్లు
  • అటవీ శాఖ, హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు కేటాయింపు
  • విద్యాశాఖకు రూ.19వేల 093 కోట్లు
  • వైద్యరంగానికి రూ.12 వేల 161కోట్లు కేటాయింపు
  • పంచాయతీరాజ్​ శాఖకు రూ.31వేల 426 కోట్లు

*షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 36,750 కోట్లు

*షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15,233 కోట్లు

  • బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ. 6,229 కోట్లు
  • షెడ్యూల్​ తెగల ప్రత్యేక ప్రగతినిధికి రూ. 15వేల 233 కోట్లు
  • ఆయిల్​ పామ్​ సాగుకు వెయ్యికోట్లు కేటాయింపు
  • మహిళా శిశు సంక్షేమానికి రూ.2వేల 131 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల 200 కోట్లు
  • కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ కోసం బడ్జెట్ లో రూ. 3,210 కోట్లు
  • పల్లె ప్రగతి… పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31, 426 కోట్లు
  • పురపాలక శాఖ కు రూ. 11, 372 కోట్లు
  • రోడ్లు భవనాలకు రూ. 2,500 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ. 4, 037 కోట్లు
  • హోమ్ శాఖకు రూ. 9,599 కోట్లు
  • కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం రూ. 200 కోట్లు
  • షెడ్యూల్​ తెగల ప్రత్యేక ప్రగతినిధికి 15వేల 233 కోట్లు
  • ఆయిల్​ పామ్​ సాగుకు వెయ్యికోట్లు కేటాయింపు
  • మహిళా శిశు సంక్షేమానికి రూ.2వేల 131 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి 2 వేల 200 కోట్లు

*గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు

  • బీసీ సంక్షేమం 6,229 కోట్లు
  • కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం 2,131 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం 2200 కోట్లు
  • రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి కోర్టు ల ఏర్పాటు
  • తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు
  • పురపాలక శాఖ కు 11, 372 కోట్లు
  • రోడ్లు భవనాలకు 2,500 కోట్లు
  • పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు
  • హోమ్ శాఖకు 9,599 కోట్లు
  • కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు
  • కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు
  • ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్ సవరణ చేస్తాం : బడ్జెట్ లో హరీష్ రావు
  • డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు
  • రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..

అంత‌కు ముందు హ‌రీష్ రావు బడ్జెట్ ప్రతులతో జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకున్న‌ సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాదభివందనం చేసి ఆశిస్సులు తీసుకున్నారు.అనంత‌రం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు.