ఇక డ్రగ్స్ అనే మాట వినపడద్దు – హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌

హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మాట వినపడొద్దంటూ కీలక ఆదేశాలు జారీ చేసారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ లో కూడా డ్రగ్స్ అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని పోలీస్ బాస్ లకు కూడా చెప్పాడు. డ్రగ్స్ విషయంలో ఎక్కడ తగ్గొద్దని, ఎవరు పట్టుబడిన వదిలిపెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసారు. ఇదే విషయాన్నీ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఆదివారం హైదరాబాద్ లో సిటీ పోలీస్ బృందంతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. నగరంలో డ్రగ్స్, గంజాయి అనే మాట వినపడవద్దని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా తక్షణ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. పబ్స్ అన్నీ కూడా.. నిర్దేశిత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమయం మించిపోయిప్పటికీ.. పబ్‌ను తెరచి ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.