అతి త్వరలో గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం – GHMC

hyderabad shilpa layout orr flyover launch soon

హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు GHMC ఎప్పటికప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏర్పటు చేస్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఎన్నో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ప్రారంభించింది. ఇక ఇప్పుడు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది.

త్వరలో గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్ వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు పూర్తిచేసింది. దీనిని ఈ నెలఖరు నాటికి ప్రారంభించేందుకు అధికారులు సన్నాకాలు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, మైండ్‌స్పేస్ జంక్షన్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

ఓ.ఆర్.ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుండి శిల్పా లే ఔట్ వరకు అక్కడ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. అప్ ర్యాంపు ఓ.ఆర్.ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓ.ఆర్.ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఈ ఫ్లైఓవర్ తో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.