గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్‌ మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

hyd-metro-rail-suspended-till-further-notice

వినాయక నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ మెట్రో ట్రైన్ల సమయాన్ని పొడిగించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘గణేశ్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం. చివరి మెట్రో రైలు సెప్టెంబర్‌ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు 2 గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది. తిరిగి మరుసటిరోజు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు యథావిధిగా నడుస్తాయి. ప్రయాణీకులు మెట్రో సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

మరోపక్క హైదరాబాద్ లో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం, శనివారం జరగనున్న గణేష్ శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 9,10 రోజుల్లో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రహదారులు మూతపడనున్నాయి.