తానేమీ బీజేపీకి బానిసను కాదంటూ కేంద్రం ఫై మమతా ఫైర్..

పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..మరోసారి కేంద్రం ఫై నిప్పులు చెరిగారు. తానేమీ బీజేపీకి బానిసను కాదని , ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మోడీ గద్దె దించుతామని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణకు రావాలని సెక్రటెరీతో లేఖ పంపారని, తానేమీ బీజేపీకి బానిసను కాదని మమతా అన్నారు. సక్రమంగా ఆహ్వానించని ఆ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని స్పష్టం చేశారు.

గురువారం రాత్రి 7 గంటలకు నేతాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారని, మీరు 6 గంటలకల్లా అక్కడ ఉండాలని బుధవారం సాయంత్రం కిందిస్థాయి కార్యదర్శి లేఖ పంపారని, ఒక ముఖ్యమంత్రికి అండర్ సెక్రటరీ ఎలా ఆహ్వాన లేఖ రాస్తారు? సాంస్కృతిక శాఖ మంత్రి అంత పెద్దవాడయ్యాడా? అని బెంగాల్ సీఎం నిలదీశారు. కలకత్తాలో నేతాజీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మమతా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చే సాధారణ ఎన్నికల్లో బిజెపిని గద్దెదించుతాయని అన్నారు. ఇందుకోసం పొరుగురాష్ట్రాలైన బిహార్​, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రులు సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.