దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

24 గంటల్లో 1.20లక్షల కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,20,529 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వరుసగా 23వ రోజు రోజువారీ కేసుల కంటే రికవరీలు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 3,380 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. ఇప్పటివరకు 2,67,95,549 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 15,55,248 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుని దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,44,082కి పెరిగింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/