హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆక్సిడెంట్ …

హైదరాబాద్ లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తప్పతాగి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు జరుగుగా..సోమవారం రెండు వేర్వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందడం తెలిసిందే. మంగళవారం కూడా హైదరాబాద్ లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ రోడ్డులో విధులు నిర్వహస్తున్న కానిస్టేబుల్ ను మహ్మద్ అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఇన్నోవా వాహనంతో ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి హైదరాబాద్ రానున్న నేపథ్యంలో పోలీసులు రిహార్సల్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సోమవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి దూసుకురావడంతో.. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో వాళ్లు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులు.. రెయిన్‌ బో హాస్పిటల్ లో పనిచేస్తున్న అయోధ్య రాయ్‌, దీపక్ గా పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రోహిత్‌.. ఫుల్‌గా మద్యం తాగి ఓవర్ స్పీడ్‌లో డ్రైవ్ చేసి.. ప్రమాదం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేశారు.