ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేదు : లోకేష్

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వైస్సార్సీపీ ప్రభుత్వంపై మ‌రోమారు ఫైర్ అయ్యారు. వైస్సార్సీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని మండిప‌డ్డారు. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే.. సీఎం జ‌గ‌న్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోందని ధ్వజమెత్తారు.

వైస్సార్సీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారని… 12 గ్రామాలు నీట మునిగాయి, రూ.1721 కోట్ల నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం, ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని మండిపడ్డారు. జల ప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చేయాల్సిన‌ ప్రభుత్వమే వారికి అండ నిలవడం బాధాకరమ‌ని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/