బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు : 19వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

19వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం

19 రౌండ్ల తర్వాత భాజపా 91,312, తెరాసకు 71,771 ఓట్లు నమోదు

18వ రౌండ్‌లో భాజపా 5,611, తెరాసకు 3,735 ఓట్లు

17వ రౌండ్‌లో భాజపాకు 1,423 ఓట్ల ఆధిక్యం

16 వ రౌండ్ లోను బిజెపి ఆధిక్యం. 16 రౌండ్లు ముగిసేసరికి 13 , 255 ఓట్ల ఆధిక్యంలో ఈటెల ఉన్నారు.

15 వ రౌండ్ ఫలితం : 2 ,149 ఓట్లతో ఈటెల భారీ ఆధిక్యం..

14వ రౌండ్‌లో భాజపాకు 1,046 ఓట్ల ఆధిక్యం..14 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 9,434 ఓట్ల ఆధిక్యం లభించింది. 14వ రౌండ్‌లో భాజపా 4,836, తెరాసకు 2,971 ఓట్లు రాగా.. ఈటలకు 1,046 ఓట్ల మెజారిటీ వచ్చింది. 14 రౌండ్లు ముగిసేసరికి భాజపా 58,333, తెరాసకు 49,945 ఓట్లు రాగా.. భాజపా 9,434 ఓట్ల ఆధిక్యంతో జోరు కనబరుస్తోంది.

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో 8, 11 రౌండ్లు మినహా.. మిగిలిన రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అమలు చేసిన శాలపల్లి గ్రామంలో… తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్​నగర్​లో ఈటల ముందంజలో నిలిచారు.

  • ఏడు రౌండ్ల తర్వాత బిజెపి పార్టీ 3438 ఓట్ల ఆధిక్యం

  • 4 రౌండ్ల తర్వాత 2,968 ఆధిక్యంలో బిజెపి
  • మూడు రౌండ్ల ముగిసేసరికి 1269 ఓట్ల ఆధిక్యంలో బిజెపి.

  • రెండో రౌండ్ లోను బిజెపి ఆధిక్యం..తెరాస ఫై 359 ఓట్ల ఆధిక్యంలో ఈటెల ఉన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. మొదట పోస్టల్ లెక్కింపు చేయగా..అందులో తెరాస ఆధిక్యం కనిపించగా..తొలి రౌండ్ లో బిజెపి ఆధిక్యం కనిపించింది. తొలి రౌండ్‌లో భాజపా 4,610, తెరాస 4,444 వచ్చాయి. దీంతో మొదటి రౌండ్ లో తెరాస ఫై 166 ఓట్ల ఆధిక్యం బిజెపి సాధించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది.

తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పంతం నెగ్గుతోందా? ఈటల రాజేందర్ పట్టుదల నిలుస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఈ ఎన్నికలను టీఆర్ఎస్ దళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నమ్మకంగా ఉన్నా తనను గెంటేసిన కేసీఆర్ పై ప్రతీకారంతో ఈటల రాజేందర్ చివరికంటా పోరాడారు. ఇక ఎన్నడూ లేనంత స్థాయిలో 86.64శాతం రికార్డ్ పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. మరి వీరిద్దరి ధీమాలో ఓటర్లు ఎవరికీ పీఠం అందజేశారనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.