బాలకృష్ణ కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తి..

Balakrishna
Balakrishna

నందమూరి బాలకృష్ణ కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తి అయ్యింది. గత కొద్దీ రోజులుగా ఆయన తన కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నొప్పి తీవ్రతరం కావడం తో హైదరాబాద్​ కేర్ ఆస్పత్రిలో చేరారు. కుడి చేతిని పైకి ఎత్తలేకపోతున్నానని… చాలా నొప్పిగా ఉంటుందని బాలయ్య తెలిపినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రి షోల్డర్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం దాదాపు నాలుగు గంటలపాటు బాలయ్యకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ పూర్తి చేసారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.