ఎమ్మెల్యే సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ రోజా భారీ డైలాగ్స్

nagari roja

మరోసారి ఏపీలో వైసీపీ కి తిరుగులేదని బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం చెప్పకనే చెప్పింది. 90,550 ఓట్ల మెజార్టీతో బద్వేల్ ఉప ఎన్నిక లో భారీ విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి సుధా. ఈ గెలుపుతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా..ప్రతిపక్ష పార్టీల ఫై సినిమా డైలాగ్స్ చెపుతూ చెమటలు పట్టించింది.

ఏ సెంటర్ అయినా, ఎలక్షన్‌ ఏదైనా, ఓన్లీ సింగిల్‌ హ్యాండ్‌.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగులు పేల్చారు. ఎవరినైనా సరే సింగిల్‌ హ్యాండ్‌తో మట్టికరిపించగల సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. బద్వేలులో గెలిచేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మూకుమ్మడిగా చేతులు కలిపి.. కుటిల ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే బద్వేల్ ప్రజలు చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలను చితకబాది తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాలోని డైలాగ్‌తో రచ్చలేపారు.