హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి గా బలమూర్ వెంకట్‌..

హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి గా బలమూర్ వెంకట్‌..

ఎట్టకేలకు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేసింది. ఈ ఉప ఎన్నికల బరిలో బలమూర్ వెంకట్ ను ఖరారు చేసింది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్‌.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేశారు. శనివారం టీపీసీసీ చేపట్టనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్‌ సందర్భంగా వెంకట్‌ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ బరిలో ఉండనుండగా… బీజేపీ పార్టీ తరఫున ఈటల రాజేందర్‌ ఉన్నారు.