బిగ్ బాస్ చరిత్రలో జస్వంత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకు ప్రేక్షకులకు కట్టిపడేస్తుంది. హౌస్ సభ్యుల మధ్య గిల్లి క‌జ్జాలు, పోట్లాట‌లు, అల‌క‌లు అనేవి కామ‌న్‌గా మారాయి. ఇక శుక్రవారం జరిగిన ఎపిసోడ్ సరదా సరదా గా సాగింది.

నాలుగో వారానికి సంబంధించి ఉత్తమ, చెత్త కంటెస్టెంట్లను ఎంచుకునే ప్రక్రియ శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది. ఇందులో చాలా మంది మానస్‌ను బెస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో జస్వంత్‌ను వరస్ట్ పెర్పార్మర్‌గా సెలెక్ట్ చేశారు. దీంతో అతడు మరోసారి జైలు పాలయ్యాడు. బిగ్ బాస్ షో చరిత్రలోనే రెండు సార్లు జైలుకెళ్లిన మొదటి కంటెస్టెంట్ జెస్సీనే. వాస్తవానికి జస్వంత్‌ పడాల కెప్టెన్‌గా హౌస్‌ను చక్కగా నడిపించడానికి ప్రయత్నించాడు. కానీ, కంటెస్టెంట్లు అందరూ కావాలనే తప్పుల మీద తప్పులు చేసినట్లు కనిపించారు. వాళ్లు చేసిన పొరపాటుకు అతడు బలయ్యాడు.

ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లో స్పెషల్‌ షో జరిగింది. ఈ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్‌ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ క్వశ్చన్‌ వేయగా శ్రీరామ్‌..హౌస్ లో ఉన్న అమ్మాయిల ఫై ఉన్న ఫీలింగ్స్ తెలిపాడు. చివర్లో హమీద తో డేట్ కు వెళ్లాలని ఉందని చెప్పి.. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని, హత్తుకుని డ్యాన్స్‌ చేశాడు. అయితే శ్రీరామ్‌ హమీదాకు క్లోజ్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది పింకీ. ఆమెను ఎత్తుకుని తిరగడం అవసరమా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. మొత్తం మీద శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.