నేడు హుజురాబాద్‌లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు

కరీంనగర్‌: నేటితో హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు, ఎందరు పోటీలో ఉండనున్నారనే విషయంతో సాయంత్రం తెలనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించనుంది.

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/