రాధే శ్యామ్ : పూజా ‘ప్రేరణ’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభాస్ – పూజా హగ్దే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే… పుట్టిన రోజు నేపథ్యంలో… ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సినిమాలో ప్రేరణ అనే క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో…. ఆ పేరుతోనే పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో లో వైట్ డ్రెస్ లో అందరినీ ఆకట్టుకుంటోంది . కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అంటే జనవరి 14 తేదీన థియేటర్లలో విడుదల కానుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.