కుర్లాలో మంటల్లో కాలిపోయిన 20 బైక్‌లు

ముంబయి: ముంబయి కుర్లాలోని నెహ్రూ న‌గ‌ర్‌లో ఉన్న రెసిడెన్షియ‌ల్ సొసైటీలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో సుమారు 20 మోటారు బైక్‌లు కాలి బూడిద‌య్యాయి. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల్ని ఆర్పేశారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/