బండ్లగూడ జాగీలో రూ. 1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ

గత ఏడాది రూ. 60.80 లక్షలు పలికిన లడ్డూ

bandlaguda-vinayaka-laddu-auction-for-1-cr-26-lakh

హైదరాబాద్‌ః హైదరాబాద్ నగరం మొత్తం జై గణేష్ నామస్మరణతో మారుమోగుతోంది. గణేశ్ ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 1.26 కోట్లు పలికింది. ఎన్నడూ లేని విధంగా ఇంత ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా ఇక్కడి గణపతి లడ్డూ రికార్డు స్థాయిలోనే ధర పలికింది. పోయిన సంవత్సరం రూ. 60.80 లక్షలు పలకగా… ఈ ఏడాది రెండింతలు ఎక్కువ ధర పలికింది.