లక్షల్లో కట్నం తీసుకొని..నెల రోజులకే భార్యను కష్టాల్లోకి నెట్టిన భర్త

లక్షల్లో కట్నం తీసుకొని..నెల రోజులకే భార్యను కష్టాల్లోకి నెట్టిన భర్త

కట్టుకున్న భార్య , భర్త ఉండగానే కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని కాపురాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వార్తల్లో నిలువగా..తాజాగా మరో ఘటన బయటకొచ్చింది. కేపీహెచ్‌బీ పోలీస్‌ స్గేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

బంజారాహిల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చార్టర్డ్‌ అకౌంటెంటుగా పని చేస్తున్న ప్రకాష్..గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన త్రివేణితో 2019 లో పెళ్లి జరిగింది. వరకట్నంగా ప్రకాష్ కు రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాష్‌ పెళ్ళైన నెలకే భార్యను దూరం పెట్టడం ..ఆమెను మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది. కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..అందుకే ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న త్రివేణి.. బుధవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషనుకు తరలించారు.