సల్మాన్ తో నాటు స్టెప్స్ వేయించిన ఎన్టీఆర్ , చరణ్

రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ మూవీ ఆర్ఆర్ఆర్. సంక్రాంతి కానుకగా జనవరి 07 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భాంగా చిత్ర ప్రమోషన్ లలో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. ఇప్పటికే పలు వేదికల్లో సందడి చేసిన హీరోలు..తాజాగా హిందీ బిగ్ బాస్ వేదిక ఫై కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సందడి చేసారు. సల్మాన్​ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్​బాస్​’ షోకు అతిథులుగా వెళ్లారు ఎన్టీఆర్​, రామ్ చరణ్, ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి. వేదిక ఫై సినిమా విశేషాలను పంచుకోవడమే కాదు ఏకంగా సల్మాన్ తో నాటు నాటు సాంగ్ కు మాస్ స్టెప్స్ వేయించారు .ఈ కార్యక్రమం శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది.

‘ఆర్ఆర్ఆర్’లో రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు.ఇక శుక్రవారం చిత్రంలోని కొముర‌మ్ భీముడో అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ తో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాటలో తార‌క్ ఎక్స్ ప్రెష‌న్స్ పీక్స్ లో ఉన్నాయి. అలాగే పాట లిరిక్స్ తో పాటు కీర‌వాణి మ్యూజిక్ కూడా అద్భ‌తంగా ఉంది.