పూజా కార్యక్రమంలో ప్రధాని..రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోడీ

మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

pm-modi-sat-in-pooja-in-ayodhya-ram-mandir

అయోధ్యః అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న శుభ ఘడియలు ఆసన్నమయ్యాయి. కాసేపట్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని మోడీ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు. బాల రాముడికి ఆయన పట్టు వస్త్రాలు, పాదుకలు, తలంబ్రాలు, ఛత్రాన్ని తీసుకొచ్చారు. వాటిని ఆలయ ప్రధాన అర్చకులు స్వీకరించారు. మోడీ ప్రస్తుతం పూజా కార్యక్రమంలో కూర్చున్నారు. ఆయనకు తిలకం దిద్దిన అర్చకులు పూజను ప్రారంభించారు. పూజలో మోడీ పక్కన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు.

మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది. రామ మందిరం మొత్తం అత్యంత సుందరంగా ముస్తాబయింది. వేడుకకు 7 వేలకు పైగా వీవీఐపీలు హాజరయ్యారు. అంతకు ముందు రామ మందిరంపైకి హెలికాప్టర్ ద్వారా పూలను చల్లారు. ప్రముఖ గాయకులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడారు.