జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సన్నిహితుల ఇళ్లలో సోదాలు

Hemant Soren
Hemant Soren

రాంచి: జార్ఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఉచ్చు బిగిస్తోంది. ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నది. అక్రమమైనింగ్‌ కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది. సోరెన్‌కు మీడియా అడ్వయిజర్‌గా ఉన్న అభిషేక్‌ ప్రసాద్‌ అలియాస్‌ పింటూ నివాసం, సాహెబ్‌గంజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నివాసంతోపాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది.