ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు

AP3 Capital Withdrawal Bill in the Assembly
AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు.

గత నెల 8 వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకం లో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని తీర్పు ఇచ్చింది ఏపీ హై కోర్టు సింగిల్ బెంచ్. అయితే…. ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. అయితే… దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది హై కోర్టు డివిజన్ బెంచ్. ఈ నేపథ్యంలోనే… జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది.