కరోనా ఎయిడ్‌ బిల్లుపై పార్లమెంట్‌ అంగీకారం

Nancy Pelosi
Nancy Pelosi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్లో కలవరం సృష్టిస్తుంది. ఈనేపథ్యంలో ఆర్థిక సహాయ ప్యాకేజీపై అమెరికా కాంగ్రెస్‌, వైట్‌హౌస్‌ దాదాపు ఒక అంగీకారానికి వచ్చాయని కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తెలిపారు. కరోనా బిల్లుపై ప్రతినిధుల సభ, సెనెట్‌ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వం తరపున చర్చలను నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖ మంత్రి స్టీవెన్‌ నుచిన్‌తో డెమోక్రాట్‌ అయిన పెలోసి గురువారమంతా చర్చలు జరిపారు. ఇరువురు ఫోన్‌లో ఎనిమిదిసార్లు చర్చలు జరిపారని పెలోసి ప్రతినిధి డ్రూ హామిల్‌ చెప్పారు. దాదాపు అన్ని అంశాలపై పరస్పరం అభిప్రాయాలు తెలుసుకున్నారని, ఒక అంగీకారానికి వచ్చినట్లేనని తెలిపారు. చాలావరకు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని పెలోసి చెప్పారు. వైరస్‌కు అయ్యే వ్యయం గురించి ఆందోళన చెందకుండా అందరూ పరీక్షలు చేయించుకునేలా ఈ బిల్లు ప్రజలను ప్రోత్సహిస్తుందని పెలోసి పేర్కొంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/